కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో సామాజిక కుటుంబ సర్వేను గురువారం పిట్లం మండల ఎంపీఓ యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సర్వే కోసం అతికించిన స్టిక్కర్లు, వాటిపై నమోదు చేసిన ఇంటి నంబర్ తదితర వివరాలను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, కరోబర్ కృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.