మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ వసంతరావు చవాన్ కొన్ని నెలల క్రితం మరణించారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ నియోజక వర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.