కామ్రేడ్ చింతం గంగారంకు ఘన నివాళులు
రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో కామ్రేడ్ చింతం గంగారం సంతాప సభను అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు, దోపిడీలపై పోరాడిన నాయకుడు చింతం గంగారం అన్నారు. ఆయన మరణం పేద ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పార్వతి, రాజేశ్వర్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.