కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తండాలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈఓ పెంటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బోయినీ సాయిలు, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నరేష్ నాయక్, రైతులు భాను, దారి సింగ్, బాదల్ సింగ్, శీను, తదితరులు పాల్గొన్నారు.