బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా నుండి వాసవి ప్రైవేట్ పాఠశాల వరకు గల వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు డ్రైనేజీ పై నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించాలని గురువారం మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులకు నోటీసులు అందజేశారు. వారం రోజుల్లోగా డ్రైనేజ్ పై నిర్మాణాలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది సతీష్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.