కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈ నెల 12న దసరా సందర్భంగా రావణదహన కార్యక్రమం చేయనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులను గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.