కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక, రాజకీయ, కుల గణన సర్వే శుక్రవారం కొనసాగింది. గురు నానక్ జన్మదినo మరియు కార్తీక పౌర్ణమి పండుగ ఉన్నప్పటికీ నిర్ణీత గడువులో సర్వే ముగించాలని ఆదేశాలు రావడంతో నేడు కూడా సర్వే కొనసాగించినట్లు ఎన్యుమరేటర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.