బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నట్లు ప్రిన్సిపల్ శైలజ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలోని 15 గురుకుల పాఠశాలలకు సంబంధించిన 1275 మంది క్రీడాకారులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్ క్రీడా పోటీలలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు.