పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ పాత్రతో ఫేమస్ అయిన కన్నడ స్టార్ హీరో ధనంజయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ధనంజయ డాక్టర్ ధన్యతను నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్గా జరిగింది. ధనుంజయ, ధన్యతల వివాహం ఫిబ్రవరి 16న మైసూరులో జరగనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.