జగిత్యాల: రైతులు, వినియోగదారులకు అందించే విద్యుత్ సేవల సమాచారం సులభంగా అర్థమయ్యేందుకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో నిర్వహించాలని శుక్రవారం ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఆయా పనులకు సంబంధించిన అంచనాల వివరాలు సహా అన్నిరకాల సమాచారాన్ని తెలుగులో అందించనున్నారు.