గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం "పొలంబాట" కార్యక్రమాన్ని ఏడీఈ వరుణ్ కుమార్ నిర్వహించారు. రైతులు పొలాల వద్ద స్టారర్లు, ఫ్యూజులు, స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలకై టోల్ ఫ్రీ 1912కి తెలియజేయాలని అన్నారు. ఇందులో గొల్లపల్లి ఏఈ రాకేష్ కుమార్, సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.