ఏపీ అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ రావడం.. తాము స్వాగతిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైజగ్ టీడీపీ ఆఫీసులో ఆయన మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు జగన్ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలి.. ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తామని మాటిచ్చారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది స్థానాలు ఉండాలని చెప్పారు.