ఐపీఎల్ 2025 ఆరంభ వేడుకలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా వేదికపై బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేశారు. వారిద్దరి డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా, ఆర్సీబీ తలపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.