భారత బ్యాటర్ విరాట్
కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. అయితే,
కోహ్లీ ఔట్ అయ్యాడు అనే కన్నా.. ఔట్ అయిన తీరే, అభిమానులను ఎక్కువ వేదనకు గురిచేస్తోంది. శుక్రవారం తొలి రోజు చివరి ఓవర్ రచిన్ రవీంద్ర వేశాడు. మూడో బంతిని
కోహ్లీ షాట్ ఆడి.. పరుగు కోసం వెళ్లాడు. వెంటనే బంతిని అందుకున్న హెన్రీ.. వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు.