ప్రజాస్వామ్యంలో ఎవరైనా సుప్రీం కోర్టు తీర్పు వినాల్సిందేనని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డును తీసుకొచ్చిందని విమర్శించారు. సుప్రీం కోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలిచ్చారని దుయ్యబట్టారు. శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతోందని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్ల కోసం BRS, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయన్నారు.