శివుడు తొలగించిన వినాయకుడి తల నేటికీ ఓ గుహలో భద్రంగా ఉంది. ఆ గుహ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వర్‌గా పిలుస్తారు. నాలుగు యుగాలకు ప్రతీకగా ఈ గుహలో మొత్తం నాలుగు రాతి కట్టడాలున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. వాటిలో ఒక స్తంభం పైకి క్రమంగా లేస్తూ ఉంటుంది. అయితే ఈ స్తంభం ప్రతి వెయ్యేళ్లకోసారి పెరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అలా స్తంభం పెరుగుతూ.. పెరుగుతూ గుహ గోడను ఎప్పుడైతే తాకుతుందో ఆ రోజు కలియుగం అంతమవుతుందట.