తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాలో మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి, వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలపై సోమవారం హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. కొంతమంది రోడ్డును ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో.. హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి వాటిని కూల్చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.