నాచారం డివిజన్లోని పలు భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జలమండలి జిఎం సంతోష్ తో శనివారం సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రధానంగా కొన్ని సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు భూగర్భ డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం వల్ల ఆగిపోయాయని తక్షణమే అలాంటి వాటికి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.