సికింద్రాబాద్: ఓఆర్ఆర్ పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఓ ఆర్ ఆర్ పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్లు కూడా ఏర్పాటు చేశారు. కాగా, మద్యం తాగి ఓ ఆర్ ఆర్ పై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.