ట్రాన్స్ జెండర్ ఫిజియాలజీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్పై గాంధీ ఆలుమ్ని భవనంలో సైంటిఫిక్ సెషన్ జరిగింది. రాష్ట్రంలోని పలు ఆసుపత్రి హెచ్ఐడీలు, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. ఇందిర, సూపరింటెండెంట్ ప్రొ. రాజకుమారి, ప్రొ. రమాదేవి హాజరయ్యారు. ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వైద్య విభాగాల ఏర్పాటుకు చర్చించారు. ట్రాన్స్ జెండర్ ఇండియాస్ ఫస్ట్ పీజీ డాక్టర్ ప్రాచీ రాథోడ్ తన అనుభవాలను వివరించారు.