ఉత్తరప్రదేశ్లోని అమేథీలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న భారత్ పెట్రోలియం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లినర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.