బోయిగూడ: సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి

79பார்த்தது
బాల్య వివాహ నిషేధ చట్టం 2006ను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థల భాగస్వామ్యం అవసరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆశ్రిత సంస్థ ఫౌండర్ నాగరాజు స్వాగతించారు. బోయిగూడ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బాల్య వివాహ నిషేధ చట్టం సంపూర్ణంగా అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. గత 3 నెలల్లో తమ సంస్థ 43 బాల్యవివాహాలను ఆపిందన్నారు.