బీజేపీ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికను శుక్రవారం మార్కెట్ పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడికి భర్త కలిసి అమ్మవారికి సాకను పెట్టడానికి వెళ్తున్న ఆమెను పోలీసులు గుడికి వెళ్లొద్దని అడ్డుకున్నారు. తాము ఇద్దరమే వెళ్తామని.. మాతో ఎవరూ కూడా లేరని పోలీసులతో ఆమె చెప్పారు. అయినా పోలీసులు వారితో వాదిస్తూ ఆలయానికి వెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు.