మోండా డివిజన్ సెకండ్ బజార్లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహకులు ఆకుల హరికృష్ణ కుటుంబ సభ్యులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేశ్ యాదవ్, జయరాజ్ పాల్గొన్నారు.