సీతాఫల్మండి తరుణి సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఫ్రైడే మార్కెట్ నాలా పక్కన అక్రమ నిర్మాణాలు ఇటీవల పెరిగిపోయాయని స్థానికులు వాపోతున్నారు. నాలా పక్కనున్న వాటర్ వర్క్స్ గేట్ వాల్ పైన డైరీ ఫార్మ్ నిర్వాహకులు దుకాణాలు నిర్మించడం పై పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.