కంటోన్మెంట్ బోర్డు పరిధిలో దశల వారీగా పలు అభివృద్ధి పనులు చేపడతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. బోర్డు పరిధిలో రూ. 303. 62 కోట్లతో సీవరేజ్ ఆధునికరణ, ప్రధాన నాలాల అభివృద్ధికి నిధులు విడుదల కావడంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను ఆదివారం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు రెండో వార్డులోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.