చిలకలగూడ: పోలీసుల వేధింపులు.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

76பார்த்தது
చిలకలగూడ: పోలీసుల వేధింపులు.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి
చిలకలగూడ పోలీసులు తనను వేధిస్తున్నారని పద్మారావునగర్కు చెందిన వ్యాపారి పాతూరి ధర్మేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏసీపీ జైపాల్ రెడ్డి తనను పీఎస్ కు పిలిపించి తను బాకీ లేనప్పటికీ ఐదుగురు వ్యక్తులకు తనతో బలవంతంగా రూ. 1.60 కోట్లు పోస్ట్ డేటెడ్ చెక్కులను రాయించుకున్నారని ఆయన వాపోయారు. ఈ విషయమై డీజీపీ, సీపీలకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி