దంపతులిద్దరు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ వారాసిగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలు. బాపూజీ నగర్ కు చెందిన చిన్నాల అమరేందర్ (53) కాచిగూడ వైశ్య హాస్టల్లో హెడ్ వార్డెన్ గా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద చిట్ బిజినెస్ కూడా నడిపిస్తున్నాడు. బిజినెస్ లో నష్టం రావడంతో డబ్బులు తిరిగివ్వాలని కస్టమర్ల ఒత్తిడి పెరిగింది. ఈనెల 14 నుంచి అమరేందర్, అతడి భార్య సబిత (49) కనిపించకుండా పోయారు.