కుల గణన సర్వే చేసే విధానం ఇది కాదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలో పర్యటించిన ఆయన కుల గణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకని ప్రశ్నించారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తలసాని విమర్శించారు.