భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్త శ్రీ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 108వ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాబాద విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హైదర్ గూడ వై జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి మోండ్ర నర్సింహా, పుస్తకాల అశోక్, బర్ల మల్లారెడ్డి, సులిగే వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.