కుత్బుల్లాపూర్: అను నిత్యం ప్రజా సేవలో ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.