కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో పార్టీ కార్యాలయంలో మానుకోట మహాధర్నా అనుమతులను నిరాకరిస్తూ ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రకటన గురువారం విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికే వెన్నెముక అయిన రైతు భూములను ఫార్మాసిటీ పేరుతో అల్లుడికి కోసం బలవంతంగా లాక్కుంటుంటే, రైతులపై నీవు చేసిన దమనకాండను, రైతు వ్యతిరేక విధానాలను మా నాయకుడు కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే నీవెన్నులో వణుకెందుకు సీఎం అని అన్నారు.