కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారు, అలివేలు మంగ అమ్మవార్లకు శుక్రవారం కార్పొరేటర్ కొలుకుల జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి రూ. 2 లక్షల ఐదు రూపాయల విలువగల వెండి కిరీటాలను సమర్పించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.