కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద విజయదశమి పండుగను పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ కుటుంబసభ్యులతో కలిసి వాహనాలకు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.