దిల్సుఖ్నగర్ లోని తపస్య కాలేజీలో మంగళవారం ఓ విద్యార్థిని చేసిన పని వైరల్ గా మారింది. తపస్య కాలేజీలో ఓ హిందూ విద్యార్థిని హిజాబ్ ధరించి చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై కాలేజ్ ప్రిన్సిపల్ షహీన్ ను వానరసేన నిలదీసింది. అంతేకాక.. హిందువులతో, ఇతర మతానికి సంబంధించిన వీడియోలు, కార్యకలాపాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఈ విషయంపై వానర సేన ఆరోపణలు చేశారు.