రేపు ఇందిరాపార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా చేపట్టనున్నారు. ఇట్టి ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుని రూ. 10 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు ఇవ్వాలని, నగరంలో కొత్తగా 20, 000 ఆటోలకు పర్మిట్లు ఇచ్చి మీటర్ చార్జీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.