కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటి ఆనంద్ అరాచకం. ఒంట్లో బాగాలేదన్నా వినకుండా 8మంది విద్యార్థినిలను చితకబాదిన పీఈటి ఆనంద్. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరన్య, అర్చన, బ్లేస్సి, కీర్తన లను గేమ్స్ పీరియడ్ లో ఆటలు ఆడేందుకు విద్యార్థినిలు రాలేదని ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్ తో చితకబాదాడు. గురువారం ఇంటికి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు స్కూల్ లో జరిగిన విషయం చెప్పడం జరిగింది.