కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో కలిశారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కువ గృహాలను కేటాయించాలని కోరారు. నగరంలో చెరువులు మురికికూపాలుగా మారిపోయాయి. వాటిని పరిశుభ్రం చేయడానికి కావలసిన నిధులు కేటాయించాలని కోరారు. స్వచ్ఛ భారత్ కింద ఎక్కువ నిధులను కేటాయించాలని కోరారు.