గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం వాటర్ వర్క్స్, సర్కిల్-7 ఎండీ వినోద్ ని కలిశారు. గతంలో మంచినీరు సరఫరా రోజు విడిచి రోజు రెండు గంటల పాటు ఉండేదని, ఇప్పుడు 7 రోజులకోసారి అది కూడా కేవలం అర గంట మాత్రమే సరఫరా అవుతుందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎండీ వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.