ముత్యంరెడ్డి నగర్ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని అల్వాల్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. స్థానిక పార్కు అభివృద్ధి, శానిటేషన్, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు.