మల్కాజిగిరి డివిజన్ పరిధిలో రాబోయే వంద రోజుల్లో జివిపి పాయింట్లు పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లుగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఆదివారం అన్నారు. వివిధ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో వ్యర్థాల తొలగింపు, స్వచ్ఛత అంశాలపై చర్చించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా, తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకు మాత్రమే వేయాలని ఆయన సూచించారు.