ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. సోమవారం ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఫసియుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, డ్రైనేజీ లైన్ సరఫరా సమస్యలను నోట్ చేసుకున్నామని తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.