ఎల్బీనగర్: నాణ్యత ప్రమాణాలు పాటించాలి
బీయన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఎఫ్ కాలనీలో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం బీయన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, జీహెచ్ఎంసీ డీఈ దామోదర్ రావుతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రాబోవు కాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలియజేసారు.