కూకట్ పల్లిలోని అతి పురాతన రామాలయానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మణ, భరత, శత్రఘ్న అంజన్నతో కలిసి పట్టాభిషిక్తుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తున్నారు. 436 ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మించారు. ఒకానొక సమయంలో అక్కన్న, మాదన్న గుడిని సందర్శించి, కాస్త అభివృద్ధి చేశారు. ఆదరణ పెరిగి 1969లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. 2022లో రూ. 20 కోట్ల నిధులతో ఈ రామాలయం పునః నిర్మాణ పనులు పూర్తి చేశారు.