కూకట్ పల్లి: వరద ముప్పు నుంచి కాపాడాలని వినతి

51பார்த்தது
కూకట్ పల్లి: వరద ముప్పు నుంచి కాపాడాలని వినతి
కూకట్ పల్లిలోని వన్సీటీని వరద ముప్పు నుంచి రక్షించాలని వన్సిటీ డైరెక్టర్లు, రెసిడెన్షియల్ ప్రతినిధుల బృందం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ పట్నం సునీతను కోరారు. ఆదివారం వారి నివాసంలో కలిసి ఇందుకు సంబంధించిన వినతి పత్రం అందజేశారు. దీనికి సంబంధించిన ఫైల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పెండింగ్ లో ఉందన్నారు. దీనిపై చొరవ చూపాలని కోరారు.

தொடர்புடைய செய்தி