లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న నిరుపేదలకు కే.పి.హెచ్.బి కాలనీ లోని పలు చర్చిల్లో కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు కూరగాయలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. అంతేకాక కూకట్ పల్లి నియోజకవర్గ జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజెర్, గ్లౌజులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అందరి ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.