లాక్‌డౌన్ వేళ కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. లాక్ డౌన్ లో వృత్తి కోల్పోయిన 100 మంది నిరుపేద బ్రాహ్మణులకు మరియు కూకట్ పల్లి డివిజన్ ఎ.వి. బి.పురంలో నివాసముంటున్న నిరు పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో సి.సి.రోడ్లు మరియు వాటర్ పైపు లైన్ ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.