గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుతం చల్లటి గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తోంది. చల్లటి వాతావరణాన్ని పట్టణ వాసులు ఆస్వాదిస్తున్నారు.