హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.