హైదరాబాద్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, రేవంత్ కాంప్రమైజ్ అయ్యారని అందుకే మొన్నటి జన్వాడా కేసును గాలికి వదిలేశారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్‌తో కేటీఆర్ ములాకత్ రాజకీయాలు నడిపిస్తున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.